- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆందోళన వద్దు.., రజనీ ఆరోగ్యం బాగుంది
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : అన్నాత్తే షూటింగ్ నిలిపివేసి హుటాహుటీన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ రజనికాంత్ ఆరోగ్యంపై నిన్నంత టెన్షన్ నెలకొంది. దీంతో రజనీ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మోహన్ బాబు, చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం కుదుట పడి మళ్లీ హుషారుగా సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో రజనీకి పలు వైద్యపరీక్షలు నిర్వహించిన ఆపోలో డాక్టర్లు తలైవా ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రజనీ కుటుంబసభ్యులు సైతం అభిమానులు ఆస్పత్రికి రావొద్దని కోరారు. కాగా నిన్న అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story