- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్‌జీఐపీటీలో ఎంబీఏ ప్రవేశాలు
భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌బరేలీ(యూపీ)లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ) మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం 2021-2022 అకాడమిక్ ఇయర్ కుగాను ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
కోర్సులు – అర్హతలు
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) :
విభాగాలు : ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పదోతరగతి స్థాయిలో 50శాతం, ఇంటర్మీడియట్ స్థాయిలో 50శాతం మార్కులు ఉండాలి.
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(డేటా అనలిటిక్స్)
అర్హత : ఏదైనా బ్రాంచ్‌లో కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా మ్యాథమేటిక్స్/స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీసీఏ/బీఎస్సీ/బీకాం/బీఏ ఉత్తీర్ణులవ్వాలి. పదోతరగతి స్థాయిలో 50శాతం, ఇంటర్మీడియట్ స్థాయిలో 50 శాతం మార్కులు ఉండాలి. జాతీయ అర్హత పరీక్షల(క్యాట్-2020 /గ్జాట్-2021/సీమ్యాట్-2021/జీమ్యాట్-2021) వాలిడ్ స్కోర్ ఉండాలి.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ : 14 మార్చి, 2021.
తరగతులు ప్రారంభం : 2 ఆగస్టు, 2021
వెబ్‌సైట్ : www.rgipt.ac.in