రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shyam |
రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: పీసీసీ పదవి ఇవ్వకపోతే.. బీజేపీనా లేదా సొంత పార్టీనా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీ అనేది కాదు కేసీఆర్‌ని ఓడగొట్టామా లేదా అనేది ముఖ్యమన్నారు. కేసీఆర్ తన గొప్పతనం వల్ల గెలువలేదని.. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే గెలిచారన్నారన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత ఓటమి చెందినప్పుడే.. నైతికంగా రాష్ర్టంలో కేసీఆర్ ఓడిపోయాడని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సమయం వచ్చినప్పుడు ప్రజల నుంచే నాయకుడు పుట్టుకొస్తాడని హితవు పలికారు. కాంగ్రెస్ అధిష్టానం గత రెండు దఫాలుగా సరైన నాయకుని ఎన్నుకోవడంలో తప్పులు చేసిందని విమర్శలు చేశారు. ఈసారి సరైన నాయకుడిని ఎంచుకోబోతోందని రాజగోపాల్‌రెడ్డి జోష్యం చెప్పారు.

tag: rajagopal reddy, sensational, comments, future



Next Story

Most Viewed