- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ భారీ వర్షసూచన మీకే!
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్ జోన్) ప్రభావంతో పాటు ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ విస్తరించిన ఉపరితల ఆవర్తనం, ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉండడంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తర కోస్తా, యానాం పరిసరప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరువూరులో 17 సెం.మీ, విశాఖపట్నంలో 10 సెం.మీ, చోడవరంలో 8 సెం.మీ, ధవళేశ్వరంలో 7 సెం,మీ, పిడుగురాళ్ల, తణుకు, కందుకూరులో 6 సెం.మీ, బద్వేల్, ఆత్మకూరు, అవనిగడ్డ, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, సంతమాగులూరు, బొబ్బిలిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.