ఏపీలో వర్షాలు..ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు

by srinivas |
ఏపీలో వర్షాలు..ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు
X

ఉత్తరాంధ్రలో అనుకోని అతిధిలా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్ర తేమగాలులు, పడమర నుంచి పొడి గాలులు కోస్తాపైకి రానున్నందున వాతావరణ అనిశ్చితి ఏర్పడింది. ఈ రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసాయి.

Tags: raining, ap, uttarandhra, north coast, see wind, humidity, bay of bengal, weather

Next Story