ఏపీలో వర్షాలు.. ఎక్కడెక్కడంటే ?

by srinivas |
ఏపీలో వర్షాలు.. ఎక్కడెక్కడంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయని పేర్కొంది. తూర్పు మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమంగా పయనించడం.. మరోవైపు రాజస్థాన్ లోని కోటా నుంచి రుతుపవన ద్రోణి బాలాసోర్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. వీటి కారణంగా రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు పడనున్నాయని తెలిపింది. అక్కడక్కడా పలు చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Advertisement

Next Story