- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు
by Shyam |

X
దిశ, న్యూస్ బ్యూరో: నైఋతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం ఒకటీ, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో వచ్చే 24 గంటలలో తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తదుపరి 24 గంటలలో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Next Story