వర్షం తగ్గితేనే టాస్ పడేది

by Shyam |   ( Updated:2020-03-12 05:51:15.0  )
వర్షం తగ్గితేనే టాస్ పడేది
X

వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ రోజు (గురువారం) ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ధర్మశాలలో భారీ వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా వేసేందుకు వీలుపడలేదు. అయితే, 20 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. సాయంత్రం 6.30 లోపు వర్షం తగ్గితేనే 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం ఉంది. మరో గంటలో వర్షం తగ్గితే ఎంపైర్లు పిచ్‌ను పరిశీలించి మ్యాచ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags: One day Series, Ind vs South Africa, Dharmashala, 20 Over match


👉 Read Disha Special stories


Next Story

Most Viewed