అలర్ట్ : ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

by srinivas |
rain
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తేలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురువనున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed