- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అత్యాచారాలపై రాజకీయాలు..!

దిశ, వెబ్‌డెస్క్ : పొలిటిషన్స్ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తుంటారు. అధికారపక్షం ఎప్పుడు తప్పు చేస్తుందా దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్షం చూస్తుంటే.. సేమ్ థియరీని అధికారపక్షాలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇటీవల యూపీలో జరిగిన హాథ్రాస్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ చేసిన రచ్చను కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇంకా మర్చిపోయినట్లు లేదు. తాజాగా పంజాబ్(కాంగ్రెస్ పాలిత రాష్ట్రం)లో ఆరేళ్ల దళిత బాలికను రేప్ చేసి హతమార్చడంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు.
‘యూపీ హాథ్రాస్ ఘటనపై స్పందించినట్లుగానే.. రాహుల్ గాంధీ పంజాబ్ రాష్ట్రంలో జరిగిన అత్యాచారానికి నిరసిస్తూ పర్యటించాలని’ కోరారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ‘యూపీలో లాగా పంజాబ్ ప్రభుత్వం ఆ బాలికపై అత్యాచారం జరిగిన అంశాన్ని దాచలేదని.. వాళ్ల ఫ్యామిలీని భయపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ నిజంగా అలా జరిగితే న్యాయం కోసం పోరాడుతానని’ రాహుల్ బదులిచ్చారు.