- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కార్యక్రమం ప్రారంభం

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే ఏపీ(Andhra Pradesh)లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో నూతన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నేటి నుంచే ప్రారంభించనుంది.
ఏపీ ప్రభుత్వం ‘మన మిత్ర’(Mana Mitra) పేరిట వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp Governance) సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పై ప్రజలలో అవగాహన కల్పించాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో మన మిత్ర కార్యక్రమాన్ని ప్రతి గడపకూ చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు(మంగళవారం) నుంచి ఇంటింటికీ మనమిత్ర కార్యక్రమాన్ని అమలు చేయనుంది. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది.. మన మిత్ర కార్యక్రమం పై ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో వారు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేస్తారు. దానిని ఎలా ఉపయోగించాలో ప్రజలకు తెలియజేస్తారు. ప్రస్తుతం250కి పైగా సేవలు వాట్సాప్‌లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500కు విస్తరించనున్నట్లు తెలుస్తోంది.
Read More..