Help desk: ఏపీ భవన్​లో హెల్ప్​డెస్క్.. నెంబర్​ ఇదే..

by Anil Sikha |   ( Updated:2025-04-23 06:26:29.0  )
Help desk: ఏపీ భవన్​లో హెల్ప్​డెస్క్.. నెంబర్​ ఇదే..
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: పహల్గాం (Pahalgam) సంఘటన నేపథ్యంలో ఏపీ భవన్​లో ఏపీ ప్రభుత్వం హెల్ప్​డెస్క్​ను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన పర్యాటకుల సమాచారం కోసం ఎమర్జెన్సీ డెస్క్​ను ఏర్పాటు చేసింది. వి.సురేష్​బాబు 9818395787 నెంబర్​కు ఫోన్​చేసి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. బాధితుల సహాయార్ధం ఈ హెల్ప్​డెస్క్​ను ఏర్పాటు చేసింది. కాగా.. పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూధనరావు మృతి చెందాదు. ఆయన తల్లిదండ్రులు అరటికాయల వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు భార్య కామాక్షి, ఇంటర్​చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. మధుసూధనరావు కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ఆయన అక్కడ సాఫ్టవేర్​ ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు. విశాఖకు చెందిన చంద్రమౌళి మృతదేహాన్ని ఎయిరిండియా విమానంలో విశాఖకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మృతదేహం విశాఖకు చేరుకోనుంది.



Next Story

Most Viewed