Today Weather Update: తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక.. రానున్న మూడ్రోజుల్లో?

by Anjali |
Today Weather Update: తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక.. రానున్న మూడ్రోజుల్లో?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాల రాకతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడే ఎండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వెదర్ పై అప్డేట్ ఇచ్చారు. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరీ ఇవాళ రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే .. గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం.. 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.



Next Story