జగన్‌పై రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2020-07-24 06:57:57.0  )
జగన్‌పై రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అవకాశం దొరికితే జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టులో ఇదే జరుగుతుందని తనకు ముందే తెలుసని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థతో పెట్టుకుని ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ని కొని తెచ్చుకోవద్దని ఘాటుగా హెచ్చరించారు.

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ చెప్పుడు మాటలు విని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తానిచ్చే సలహాలను స్వీకరించకుండా ఎంతో మంది సలహాదారులను నియమించుకున్నారన్న రఘురాజు వారేమో సరైన సలహాలివ్వరని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను కించపరుస్తూ, దుర్భాషలాడుతూ వైఎస్సార్సీపీ నేతలు పోస్టులు పెడతారని ఆయన ఆరోపించారు. అలాంటి వారికి అదిష్ఠానం మద్దతిస్తుందని మండిపడ్డారు. మనమేం చేసిన చెల్లుబాటవుతుందనుకుంటే…కోర్టులు చూస్తూ ఊరుకోవని ఆయన హెచ్చరించారు. విమర్శలను స్వీకరించాలని ఆయన సూచించారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు ఎంతో దూరం లేదని ఆయన తెలిపారు.

Advertisement

Next Story