- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Whatsapp: వాట్సాప్‌లో అందుబాటులోకి అదిరిపోయే సూపర్ ఫీచర్లు

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను (New feature) తీసుకొచ్చింది. వినియోగదారులు వీడియో కాలింగ్ సమయంలో మరింత మెరుగైన ఎక్స్పీరియన్స్ పొందెందుకు ఇది సాయపడుతుంది. ఇందుకోసం మెటా (Meta) వీడియో కాలింగ్‌లో రంగు రంగుల బ్యాక్ గ్రౌండ్ ఛేంజింగ్ ఎఫెక్ట్, రకరకాల ఫన్నీ టూల్స్ ఆప్షన్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. ఇది వాట్సాప్ గ్రూప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో స్నాప్, ఇన్‌స్టాలో మాదిరిగా కుక్కపిల్ల చెవుల వంటి ఫన్ ఎఫెక్ట్‌లను ఉపయోగించేందుకు సహాయం చేస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్ దాదాపు అందరికి అందుబాటులోకి వచ్చింది.
అలాగే, వాట్సాప్‌లో త్వరలోనే మరో సూపర్ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇకపై వినియోగదారులు తమ స్టేటస్‌కు 90 సెకన్ల నిడివి గల వీడియోలను అప్లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అంటే వినియోగదారులు ఇప్పుడు దాదాపు ఒకటిన్నర నిమిషాల వరకు వీడియోను స్టేటస్‌లో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.