‘ఆయన ఇప్పుడు చేశారు.. నేను అప్పుడే చేశాను’

by srinivas |
‘ఆయన ఇప్పుడు చేశారు.. నేను అప్పుడే చేశాను’
X

దిశ ఏపీ బ్యూరో: నరసాపురంలో రాజకీయం రక్తి కడుతోంది. వైఎస్సార్సీపీ నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి శ్రీరంగనాథరాజు పశ్చిమగోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, శ్రీరంగనాథరాజు తనపై ఫిర్యాదు చేయడం సరికాదని అన్నారు. తన దిష్టిబొమ్మను దహనం చేశారంటూ 20 రోజుల క్రితమే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని గుర్తు చేసిన ఆయన, ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇప్పుడు తానే ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశానని తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

Advertisement

Next Story