- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవేమైనా కారుణ్య నియామకాలా….
దిశ, దుబ్బాక :
వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పడమనేది దుబ్బాక నుంచే ప్రారంభం కావాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందనరావు అన్నారు. తండ్రి చనిపోతె కొడుకు, కొడుకు చనిపోతే కోడలుకు ఇవ్వడానికి ఇదేమన్న కారుణ్య నియామకాలా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శౌరీపూర్, దీపాయం పల్లితో పాటు దౌల్తాబాద్ మండలకేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. గతంలో ఎన్నడూ రాని మంత్రి హరీశ్ రావు ఎన్నికలు రాగానే ప్రతి రోజు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సిద్దిపేట, దుబ్బాక రెండు కండ్ల లాంటివి అని చెప్పే మంత్రికి ఇన్ని రోజులు దుబ్బాక ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటూ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఎంత అసత్య ప్రచారాలు చేసినా దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.