ఫ్రెంచ్ ఓపెన్‌లో నదాల్‌కు క్లిష్టమైన డ్రా

by Shyam |
ఫ్రెంచ్ ఓపెన్‌లో నదాల్‌కు క్లిష్టమైన డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ డ్రాను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ఉన్న రఫేల్ నదాల్‌కు క్లిష్టమైన డ్రా వచ్చింది. 12 సార్లు రోలాండ్ గారోస్‌లో విజేతగా నిలిచిన నదాల్ తొలి రౌండ్‌లో ఈగార్ జెరాసిమోవ్‌ను ఎదుర్కుంటాడు. ఇక ఆ తర్వాతి రౌండ్స్‌లో యూఎస్ ఓపెన్ రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఎదుర్కోవలసి రావొచ్చు.

సెమీస్‌కి కనుక చేరుకుంటే యూఎస్ ఓపెన్ విజేత డోమినిక్ థీమ్‌తో తలపడాల్సి వస్తున్నది. మరోవైపు ఇటాలియన్ ఓపెన్ విజేత నోవాక్ జకోవిచ్‌కు తేలికైన డ్రానే లభించింది. ఇక మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సిమోనా హెలెప్ నాలుగో రౌండ్‌లో విక్టోరియా అజరెంకాను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. సెరేనా విలియమ్స్ తొలి రౌండ్‌లో క్రిస్టీతో ఆడనుంది. ఈ నెల 27 ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ అక్టోబర్ 11న ముగియనుంది.

Advertisement

Next Story