సీఎం కేసీఆర్ కు రచ్చ రవి విన్నపం ఏంటంటే..

by Anukaran |   ( Updated:2020-07-11 11:30:46.0  )
సీఎం కేసీఆర్ కు రచ్చ రవి విన్నపం ఏంటంటే..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మృతుల పట్ల బంధువుల్లో నెలకొన్న ఆందోళనలపై జబర్దస్త్ యాక్టర్ రచ్చ రవి స్పందించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌‌కు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో సందేశాన్ని తన ఇస్టా ఖాతా ద్వారా పోస్టు చేశారు. కరోనా బారిన పడి ఎవరైనా మరణిస్తే అంతకంటే దారుణం మరోటి లేదన్నాడు. చనిపోయిన వ్యక్తిని చూసేందుకు కనీసం అతడి కుటుంబ సభ్యులకు కూడా అనుమతులు లేకుండా పోవడం దారుణమన్నాడు. అతడి కుటుంబీకులు అందరూ ఉన్నప్పటికీ.. కడసారి చూపులకు నోచుకోలేక అనాథ
శవంలా వాళ్లను ఖననం చేస్తున్నారని.. అది చనిపోయిన దానికంటే కూడా ఎక్కువ బాధ కలిగిస్తుందని రచ్చ రవి తన అభిప్రాయం వ్యక్తంచేశాడు.

అందువల్లే తన రిక్వెస్ట్ ఏంటంటే.. కరోనాతో మరణించిన వ్యక్తి డెడ్ బాడీ నుంచి వైరస్ బయటకు రాకుండా ఉండేలా ఓ స్పెషల్ బాక్సులో పెట్టి కుటుంబీకులకు ఇవ్వాలని కోరాడు. అలా చేస్తే వాళ్లు చివరి చూపు చూసుకొని మళ్లీ అప్పజెప్పడమో లేక ప్రభుత్వ నిబంధనల మేరకు ఖననం చేయడమో చేస్తారని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తన వంతుగా విజ్ఞప్తి చేసాడు.

Advertisement

Next Story

Most Viewed