మాస్క్ ధరించకుంటే మూడేళ్ల జైలు శిక్ష!

by vinod kumar |   ( Updated:2020-05-16 08:56:53.0  )
మాస్క్ ధరించకుంటే మూడేళ్ల జైలు శిక్ష!
X

దోహ :

శిక్షలు విధించడంలో గల్ఫ్ దేశాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు కరోనా వైరస్ అన్ని దేశాలను కబళించేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సహా అనేక నిబంధనలు అమలు చేస్తున్నాయి. గల్ఫ్ దేశమైన ఖతార్‌ కూడా సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తూ చట్టం చేసింది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని చెబుతోంది. ముఖానికి మాస్కు లేకుండా బయటకు వస్తే 2 లక్షల రియాల్స్ (దాదాపు రూ. 42 లక్షలు) జరిమానాతో పాటు, మూడేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తామని ఖతార్ ప్రభుత్వం హెచ్చరించింది. ఖతార్ జనాభా కేవలం 27 లక్షలు. కానీ వీరిలో 28 వేల మంది కరోనా బారిన పడటంతో ఇలాంటి కఠిన శిక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటి వరకు 14 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణ రంగానికి సంబంధించిన పనులు మాత్రమే జరుగుతున్నాయి. మసీదులు సహా ప్రజలు గుమికూడే అవకాశం ఉన్న అన్ని స్థలాలను మూసేశారు.

Advertisement

Next Story

Most Viewed