నిరాడంబరంగా పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం

by Shamantha N |
Puri-Yatra
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా పూరీ జగన్నాథుని రథయాత్ర భక్తులు లేకుండానే నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రథయాత్ర వేళ పూరీలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి, పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పూరీలోని శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు.. నిరాడంబరంగా వేడుక నిర్వహిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరారు.

Advertisement

Next Story

Most Viewed