- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిరు 'పునాది రాళ్లు' దర్శకుడు కన్నుమూత
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణానికి పునాది వేసిన దర్శకులు రాజ్ కుమార్ కన్నుమూశారు. పునాది రాళ్లు సినిమాతో చిరుని సినీ రంగానికి పరిచయం చేసిన ఆయన.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. రాజ్ కుమార్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం భార్య, పెద్ద కుమారుడు చనిపోవడాన్ని తట్టుకోలేని రాజ్ కుమార్ చాలా కుంగిపోయారు. దీంతో అనారోగ్యంతో ఉన్న ఆయన పరిస్థితి మరింత చేజారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూనే మృతి చెందారు. కాగా రాజ్ కుమార్ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు కాగా.. ఆయన పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేశారు చిన్న కుమారుడు.
పునాది రాళ్లు సినిమా చిరంజీవితో పాటు డైరెక్టర్‌గా రాజ్ కుమార్‌కు కూడా తొలి సినిమానే. కానీ ఈ చిత్రానికి ఐదు నంది అవార్డులు గెలుచుకుని గుర్తింపు పొందారు ఆయన. ఆ తర్వాత నిర్మాతగాను చాలా చిత్రాలను రూపొందించారు రాజ్ కుమార్.