పబ్‌‌జీ లవర్స్‌కి గుడ్ న్యూస్..

by Anukaran |   ( Updated:2021-05-04 04:12:51.0  )
పబ్‌‌జీ లవర్స్‌కి గుడ్ న్యూస్..
X

దిశ, ఫీచర్స్ : పీసీ వెర్షన్ పబ్‌జీ లైట్ సర్వర్‌ సేవలను నిలిపివేసిన విషయాన్ని గేమ్ డెవలపర్లు ఇటీవలే ప్రకటించారు. మొబైల్ వెర్షన్‌లో మాత్రం ఇంతకుముందు వలెనే పనిచేయనుండగా ఇండియాలో ‘పబ్‌జీ’ని గతేడాది సెప్టెంబర్‌లో నిషేధించిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ భారత్‌లో అడుగుపెట్టేందుకు ఈ గేమింగ్ కంపెనీ ప్రయత్నిస్తూనే ఉంది. గేమింగ్ లవర్స్ సైతం ఈ గేమ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రీడిజైన్డ్ గేమ్ అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే గత వారం యూట్యూబ్‌లో ఓ టీజర్ విడుదల చేసిన PUBG మొబైల్ ఇండియా.. పబ్‌జీ ఆటగాళ్లకు ఓ గుడ్‌న్యూస్ అందించింది. ఈ మేరకు కొన్ని నివేదికల ప్రకారం PUBG మొబైల్ ఇండియా ‘బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’గా రాబోతున్నట్లు తెలుస్తోంది .

PUBG మొబైల్ ఇండియా వెబ్‌సైట్ సోర్స్ కోడ్ డేటాను పరిశీలించిన గేమింగ్ అండ్ స్పోర్ట్స్‌ న్యూస్ వెబ్‌సైట్ జెమ్‌వైర్.. పబ్‌జీని ‘బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’గా తీసుకొస్తున్నట్లు గుర్తించింది. అంతేకాదు ‘బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ పేరు కలిగిఉన్న మల్టీపుల్ డొమైన్‌లను సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ ‘క్రాఫ్టన్’ కొనుగోలు చేసినట్లు AFK గేమింగ్ నివేదించింది. ఇక PUBG మొబైల్ ఇండియా ఫేస్‌బుక్ పేజీ URL కూడా కొత్త పేరును కలిగి ఉంది. ఈ మార్పులు గేమ్ లాంచ్ త్వరలోనే ఉండొచ్చనే విషయాన్ని సూచిస్తున్నాయి. కాగా ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి కూడా PUBG మొబైల్ ఇండియాకు ఆమోదం లభించినట్లు సమాచారం.

గతేడాది నవంబర్‌లో మొబైల్ గేమ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పినప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్‌జీ గేమింగ్ ప్రియులకు తాజా న్యూస్ ఊరటనిస్తోంది. ఇక గత సంవత్సరం ఇతర చైనీస్ యాప్స్‌తో పబ్‌జీ మొబైల్‌ను నిషేధించిన తర్వాత PUBG కార్పొరేషన్, క్రాఫ్టన్.. ‘PUBG మొబైల్ ఇండియా’ను భారతీయ మార్కెట్ కోసం తయారుచేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story