Massive Heatwave : డోసు పెంచిన సూర్యుడు.. నిజామాబాద్ లో రికార్డ్ స్థాయి 45 డిగ్రీలు

by M.Rajitha |
Massive Heatwave : డోసు పెంచిన సూర్యుడు.. నిజామాబాద్ లో రికార్డ్ స్థాయి 45 డిగ్రీలు
X

దిశ, వెబ్ డెస్క్ : సూర్యుడు డోసు పెంచడంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి(Massive Heatwave). ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. వడగాల్పులు, ఉక్కపోతతో సతమతం అయ్యారు. బుధవారం నిజామాబాద్(Nizamabad) లో ఏకంగా రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లో 45.3 డిగ్రీలు, అదిలాబాద్ 45.2, నిర్మల్ 45.1, మంచిర్యాల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారి.

ఇక రాష్ట్ర రాజధానిలో కూడా ఎండ ప్రతాపం చూపించింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగర వాసులు ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రానున్న మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్టు వాతావరణకేంద్రం అధికారులు పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప పగలు బయటికి రావొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.



Next Story

Most Viewed