- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పిల్లలను పిరుదులపై కొడుతున్నారా?.. అయితే చిక్కుల్లో పడ్డట్టే!
దిశ, ఫీచర్స్ : పిల్లలు చిట్టి పొట్టి మాటలతో ఎంతలా ముద్దొస్తారో.. తమ అల్లరితో అంతలా విసుగు తెప్పిస్తారు. హోమ్ వర్క్ చేయకుండా, అన్నం తినకుండా మారాం చేస్తారు. ఈ క్రమంలో సాధ్యమైనంత వరకు బుజ్జగించే పేరెంట్స్.. ఒక్కోసారి దండిస్తారు. అయితే ఆ దండన శృతిమించితేనే ప్రాబ్లమ్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇక పిరుదులపై కొడితే(స్పాంకింగ్), అది పిల్లల మానసికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా లేడీ సైకాలజిస్ట్ ఒకరు ఈ విషయంపై హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫలితాలను టిక్ టాక్ వీడియో ద్వారా వివరించింది.
అమెరికాలోని ఆస్టిన్‌కు చెందిన డాక్టర్ రేన్.. ఒక లైసెన్స్‌డ్ సైకాలజిస్ట్. పాండమిక్ టైమ్‌లో నెలకొన్న పరిస్థితులు చూసి టిక్ టాక్‌లో మెంటల్ హెల్త్‌కు సంబంధించిన వీడియోలు చేస్తోంది. ఇక తన లేటెస్ట్ వీడియోలో పిల్లల మానసిక ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వివిధ ప్రాంతాలకు చెందిన 10-11 సంవత్సరాల పిల్లల ఆలోచనల్లో తేడాను గుర్తించేందుకు హార్వర్డ్ రీసెర్చర్స్ fMRI మెషిన్ ఉపయోగించి స్టడీ చేపట్టారు. ఇందులో భాగంగా కొంతమంది పిల్లలకు అనేక రకాల చిత్రాలు చూపించి వారి ముఖ కవళికలతో పాటు మెదడులో కలిగే ఉద్రేకాలను రికార్డు చేశారు. చిత్రాలు చూపించిన క్రమంలో సాధారణ పిల్లల కంటే పేరెంట్స్‌తో పిరుదులపై దెబ్బలుతిన్న పిల్లలు మరింత ఉద్రేకానికి గురైనట్టు గుర్తించారు. అంతేకాదు వీరి బ్రెయిన్ ప్యాటర్న్స్.. ఇతర కఠినతర పనిష్మెంట్స్ ఎదుర్కొన్న పిల్లల మెదడు తీరుగానే ఉండటం విశేషం. ఈ మేరకు పిరుదులపై సుతిమెత్తగా దండించినా, అది బ్రెయిన్ డెవలప్‌మెంట్‌పై అధిక ప్రభావాన్ని చూపెడుతుందని, మొత్తం మీద మెదడులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తించేందుకు దారితీస్తుందని స్పష్టమైంది.
తల్లిదండ్రులు పిల్లలను శారీరకంగా దండిస్తే.. వారిలో ఆందోళన, ఒత్తిడి, బిహేవియర్ ప్రాబ్లమ్స్‌తో పాటు మెంటల్ హెల్త్ సమస్యలు తలెత్తుతాయనే విషయం తెలిసిందే. కానీ పిరుదులపై కొట్టడం కూడా వయొలెన్స్ కిందకు వస్తుందనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదని ఈ అధ్యయనంలో పాల్గొన్న సీనియర్ రీసెర్చర్ మెక్లాన్ కూడా వెల్లడించారు. పేరెంట్స్‌తో పాటు ఈ తరం మిలీనియల్స్ కూడా స్పాంకింగ్ అనేది భవిష్యత్తులో తమ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గ్రహించారని అనుకోవడం లేదంటున్న డాక్టర్ రేన్.. ‘దీన్ని ఆమోదయోగ్యమైన పనిష్మెంట్‌గా గుర్తిస్తున్నారు. ఇతరత్రా కఠిన శారీరక శిక్షలతో దీన్ని పోల్చడం లేదు. ఈ విషయంపై అవగాహన ఉన్నవారు సైతం తమ చర్యలను కొనసాగించేందుకే మొగ్గుచూపుతుండటం గమనార్హం. మొత్తానికి సామాజిక విశ్వాసాలు బలంగా ఉన్నా.. మార్పు నెమ్మదిగా మొదలైంది. అయితే సమస్య గుర్తించబడినందుకు సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.