- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైద్యురాలికి సైకో లవర్ వేధింపులు.. మేడం మీరు చాలా అందంగా ఉన్నారంటూ

దిశ,వెబ్‌డెస్క్: మనం జీపీఎస్ ను ఎందుకు వినియోగిస్తాం ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లేందుకు. కానీ ఇతగాడు మాత్రం డాక్టర్ ను వేధించేందుకు ఉపయోగించుకున్నాడు.
జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. విశ్వనాథ్ అనే కామాంధుడు తన జుట్టు రాలిపోతుందని, జుట్టు రాలకుండా ట్రీట్మెంట్ చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ కు చెందిన ఓ ఆస్పత్రి వైద్యురాల్ని ఆశ్రయించాడు. రోజులు గడుస్తున్నాయి. విశ్వనాథ్ ట్రీట్మెంట్ పేరుతో మీరు చాలా అందంగా ఉన్నారు మేడం అంటూ బాధితురాల్ని వేధించడం మొదలు పెట్టాడు. రహస్యంగా ఆమె కారుకు జీపీఎస్ ను అమర్చి ఆమె ఎక్కడుంటే అక్కడ వాలిపోయేవాడు.
అదే సమయంలో బాధితురాలు ఉంటున్న అపార్ట్ మెంట్ లో నాగరాజు అనే పేరుతో అద్దెకి దిగాడు. మెల్లిగా మహిళా డాక్టర్ కుమారుడికి దగ్గరయ్యాడు. ఆమె కుమారుడిని తన వద్దే వదిలేయాలని లేదంటే హతమారుస్తానంటూ బెదిరించాడు. దీంతో వేధింపులు పడలేక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త శ్రీకాంత్ గౌడ్ విశ్వనాథ్ కు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ కామాంధుడు రివర్స్ లో ఆమెకు, ఆమె భర్తను వేధించడం మొదలు పెట్టాడు. దాదాపూ 4నెలల నుంచి విశ్వనాథ్ వేధింపులు తట్టుకోలేక జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్వనాథ్ ను అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు.