ఇంట్రెస్టింగ్‌గా పవన్@28 కాన్సెప్ట్ పోస్టర్..

దిశ, వెబ్‌డెస్క్ : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఉంటుందని హామీనిచ్చిన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పవన్ 28వ చిత్రం డైరెక్ట్ చేస్తున్న ఆయన.. చెప్పినట్లుగానే సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈసారి కేవలం జస్ట్ ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదని చెప్పిన హరీష్.. మెసేజ్‌తో కూడిన మూవీ చేయబోతున్నట్లు చెప్పాడు.

https://twitter.com/harish2you/status/1301109346764386305?s=19

ఇక సినిమా కాన్సెప్ట్ పోస్టర్.. బైక్, పెద్ద బాలశిక్ష, గులాబీ పువ్వుతో పాటు ఇండియా గేట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రాలతో నిండి ఉండగా.. గబ్బర్ సింగ్‌ను మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు సోషల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయ్యాయంటే బొమ్మ మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తే రచ్చ మామూలుగా ఉండదని చెబుతున్నారు ఫ్యాన్స్. కాన్సెప్ట్ చెప్పడం కాదు కథతో హిట్ కొట్టి పడేద్దాం అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేయనున్నారు.

Advertisement