- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల నిరసనలు, ప్రధాని మోదీ చిత్రపటం దగ్ధం
దిశ, ఇందల్వాయి: కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానం పట్ల టీఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ చిత్రపటానికి చావు డప్పు మోగించారు. అనంతరం మోడీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రధాని మోడీ నిరంకుశ పాలన చేస్తున్నారన్నారు. రైతుల పట్ల మొండిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చే నిధులు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2400కోట్లు రైతుల కోసం ఇస్తున్నామన్నారు. బీజేపీ పార్టీ వల్ల రాష్ట్రంలో రైతులు అఘాయిత్యాలకు పాల్పడినట్లైతే బీజేపీ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా వానాకాలం పంటను, యాసంగి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన దానికి నిరసనగా ఢిల్లీలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వంటి రాష్ట్రాల రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాన్ని రద్దు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు, రెండున్నర ఏళ్లుగా చేసిన పట్టించుకోలేదన్నారు. ఈ నిరసనలతో దేశవ్యాప్తంగా 750మంది మరణించారన్నారు. కేవలం గోవా, పంజాబ్, వంటి రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉండడం పట్లనే ప్రధాని మోడీ రైతుల పట్ల వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం సిగ్గు చేటని అన్నారు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మిగతావారు ఇష్టానుసారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులకు రైతు బంధుకు 30, 000కోట్లు, రైతు బీమా, ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఫుడ్ కార్పొరేషన్ పెట్టారన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహిస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రధాని మోడీ దేశం మొత్తాన్ని ప్రయివేటు పరం చేస్తున్నారని దీనిని అన్ని రాష్ట్రాలు గమనిస్తున్నాయని అన్నారు. రాబోవు రోజుల్లో బీజేపీ పార్టీకి గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజి గౌడ్, ఉమ్మడి జిల్లా ఐ. డి.సి.ఎం.ఎస్.సి చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేష్ నాయక్, జెడ్పీటీసీ సుమన రవి రెడ్డి, వైస్ ఎంపీపీ అంజయ్య, పార్టీ మండలాధ్యక్షులు గంగాదాసు, పీఎసీఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాశం కుమార్, పార్టీ ఉపాధ్యక్షులు బిరిష్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, ముత్తన్న, అశ్విని శ్రీనివాస్, రఘు,చందర్ నాయక్, కుమార్ నాయక్,కాశీరాం, గంగాధర్,లింగంపల్లి రాజేందర్, సుధాకర్,రాము,గోపాల్, దాస్, నరేష్, సత్యనారాయణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.