భూ వివాదాన్ని పరిష్కరించాలి

by Shyam |
భూ వివాదాన్ని పరిష్కరించాలి
X

దిశ, రంగారెడ్డి: కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన షేక్‌ యూసుఫ్ ఉద్దీన్, షేక్‌ గౌస్ ఉద్దీన్, షేక్ బురానుద్దీన్, మహబూబ్‌ సాబ్‌లు సోమవారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 241, 251, 252‌లోని 13ఎకరాల ఒక గుంట భూమిపై వివాదం జరుగుతున్నప్పటికీ తమ ప్రత్యర్థులు నిబంధనలు ఉల్లంఘించి లాక్‌డౌన్ సమయంలో బోరు వేశారని నిరసనకు దిగారు. భూ వివాదానికి సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు తమ సమస్యను పరిష్కరించే వరకు భూమిలోకి ఎవరూ వెళ్లకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story