- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎక్సైజ్ శాఖలో త్వరలోనే పదోన్నతులు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆబ్కారీ శాఖలో త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఆబ్కారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పదోన్నతుల అంశంలో నిర్ణయం తీసుకుంటామని సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. కార్యక్రమంలో అబ్కారీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రవీందర్రావు, టీజీవో ప్రధాన కార్మదర్శి సత్యనారాయణ, కోశాధికారి తమటం లక్ష్మణ్ గౌడ్, సహాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Next Story