హెచ్ఎంటీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

by Shyam |
హెచ్ఎంటీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
X

దిశ, కుత్బుల్లాపూర్: హెచ్ఎంటీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద కోరారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని హెచ్ఎంటీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఎమ్మెల్యే కేపీ వివేకానంద, దేశవ్యాప్తంగా గల పరిశ్రమల యూనియన్ సభ్యులతో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండేను బుధవారం ఢిల్లీలో కలిశారు. సమస్యలకు పరిష్కారం చూపాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సును 58 నుండి 60 కి పెంచాలని కోరారు.

ప్రాగా యూనిట్‌లో గత 35 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులకు సెటిల్మెంట్ చేసి న్యాయం జరిగేలా చూడాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలో అన్ని రంగాల్లో విలీనం చేయడం లేదా 2017 పే స్కేల్, క్యాజువల్ ఎంప్లాయిస్ సమస్యలు ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమును ప్రకటించేలా చొరవ చూపాలన్నారు. దీనికి మంత్రి మహేంద్ర నాథ్ పాండే సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మహేందర్, సత్యనారాయణ, శ్రీశైలం, ఆనందరావు, హరీష్, విజయ్ కుమార్, సదానంద, గోపాల్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed