దీపం-2 పథకం లబ్దిదారులకు అలర్ట్.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2025-03-31 10:49:21.0  )
దీపం-2 పథకం లబ్దిదారులకు అలర్ట్.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దీపం–2 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) విశాఖపట్నంలోని జనసేన నగర పార్టీ కార్యాలయం(Janasena Office)లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో 90 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్(Free gas cylinder) అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ క్రమంలో రేపటి(మంగళవారం) నుంచి కొత్త సిలిండర్‌ కోసం లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. ధాన్యం అమ్మిన రైతుల అకౌంట్లలోకి 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.8,200 కోట్లు జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం(CM Chandrababu), డిప్యూటీ సీఎం(Deputy CM Pawan Kalyan) తపన పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో త్వరలో ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు రానున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Read More..

‘ఇదేనా పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed