- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూ టర్న్ లేదు.. పోలీసుల చలాన్లతో వాహనదారుల ఇబ్బందులు
దిశ, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఎన్హెచ్ఏఐ నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి వాహనదారుల పాలిట శాపంగా మారింది. ఎన్హెచ్ఏఐ అధికారులు మండల కేంద్రంలో స్థానికుల సౌకర్యం కోసం యూటర్న్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రెండు నిండు ప్రాణాలను బలి తీసుకోగా.. సర్వీస్ రోడ్డులో ప్రయాణించే వాహనదారుల పాలిట ఇప్పుడు పోలీసులు శాపంగా పరిణమించారు.
ద్విచక్ర వాహనదారులు అండర్ పాస్ ద్వారా ఇరువైపుల ఉన్న సర్వీస్ రోడ్డులోకి వెళ్లకూడదని పోలీసులు అంటున్నారు. సర్వీస్ రోడ్డులో కూడా వన్ వే మాదిరిగానే ప్రయాణించాలని, లేదంటే చలాన్లు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాదు, కూడదు అంటే అత్యుత్సాహం ప్రదర్శించి టార్గెట్ కోసం కనిపించిన ప్రతి ద్విచక్ర వాహనాన్ని నిలిపివేసి చలాన్లు విధిస్తున్నారు.
రఘునాథపల్లిలో నేషనల్ హైవేకు ఇరువైపులా ప్రయాణించాలంటే ఏకైక మార్గం.. ఒక్క అండర్ పాస్ మాత్రమే. అలాంటిది అసలు అలా రావద్దంటూ పోలీసులు హుకూం జారీ చేస్తున్నారు. దీంతో మండల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉంటే, పోలీసుల తీరుపై సర్వత్రా పెదవి విరుస్తున్నారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్ వేలో ప్రయాణించాలంటే సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రయాణించాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Motorists