- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారు ఉండలేరు.. వెళ్లలేరు..!
దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ పొడిగింపుతో వలస కూలీల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో అన్నట్లుగా మారింది. వెళ్లే వీలులేక.. ఉండే పరిస్థితి లేక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వలస కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. తమను స్వస్థలాలకు పంపాలని అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా కాలిబాటన చేరుకునేందుకు బయల్దేరి వెళ్తున్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ల నుంచి వచ్చిన ఎంతో మంది కూలీల్లో ఇప్పటికే ఇలా వెళ్లిపోవడం గమనార్హం. అయితే మహారాష్ట్ర, ఒడిశా కూలీలు మాత్రం వేలసంఖ్యలో జిల్లాలో చిక్కుకుపోయారు. మూడు రోజుల క్రితం కాలిబాటన తమ స్వగ్రామాలకు చేరుకుంటామని బయల్దేరిన కూలీలను పోలీస్ అధికారులు అడ్డుకున్నారు.
లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని అధికారులు నిర్బంధంగా వారిని మళ్లీ వలస వచ్చిన ప్రాంతాలకు తరలించారు. కూలీలకు కొన్ని బాధలు ఎదురవుతున్న మాట వాస్తవమే.. అయినా లాక్‌డౌన్ ఎత్తివేసేంత వరకు ఉన్నచోటులోనే ఉండాలనే నిబంధనలను పాటించక తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రెండు జిల్లాలకు ఏటా…
ప్రతి ఏటా మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతాల నుంచి మిరప పంటను ఏరేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వేలాదిగా వలస కూలీలు తరలివస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం దాదాపు 40,000 మందికిపైగా వలస కూలీలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకున్నారు. మిరప పంట తెంపుడు జోరుగా సాగుతున్న క్రమంలోనే కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో వలస కూలీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ముగిసిపోతుందని గంపెడాశలు పెట్టుకున్న కూలీలకు నిరాశే మిగిలింది. లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాస్తవంలో మాత్రం తమకు ఎలాంటి చేయూత అందడం లేదని కూలీలు వాపోతున్నారు. ప్రభుత్వం అందజేసిన రూ.500 సాయం, బియ్యం కొంతమందికే అందాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే అధికారులు మాత్రం లెక్కలతో సహా సాయం అందజేసినవారి వివరాలు చెబుతుండటం గమనార్హం.
కూలీలకు భరోసా కల్పించాలి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25,017 మంది వలస కూలీలు ఉన్నారు. మొదటి విడతలో 15,029 మందికి బియ్యం, నగదు పంపిణీ చేశాం. రెండో విడతలో మిగిలిన 9,988 కి బియ్యం, నగదు తక్షణమే పంపిణీ చేయాలని ఆదేశించాం. వలస కూలీలు కొంత ఆందోళనలో ఉన్నారు. వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్, తీసుకొచ్చిన రైతులకు, వీఆర్వోలపై ఉంటుంది. వలస కూలీల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించాం’ అని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు.
Tags: Khammam, Corona Effect, Collector, Migrant Workers, Problems