- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై విచారణకు ప్యానెల్
by Shamantha N |

X
లక్నో: వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వెల్లడైన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం దీని విచారణ కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. నేర సామ్రాజ్యంలో వికాస్ దూబే ఎదుగదల, అతనిపై కేసులకు తీసుకున్న చర్యలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాతి రోజే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్యానెల్‌ను ప్రకటించింది. రిటైర్డ్ జడ్జీ శశికాంత్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ సింగిల్ మెంబర్ కమిటీ.. ఈ నెల 3వ తేదీ ఉదయం ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ఘటన మొదలు వికాస్ దూబే ఎన్‌కౌంటర్ వరకు చోటుచేసుకున్న అన్ని ఎన్‌కౌంటర్‌లను విచారించనుంది.
Next Story