- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చీటింగ్ చేసిన చిట్టీల పూలమ్మ…
దిశ వెబ్ డెస్క్: పేద, మధ్యతరగతి కుటుంబాలలో చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు కొంచెం కొంచెం కూడబెట్టుకొని చిట్టీలు వేస్తుంటారు. వారి అవసరాన్ని అవకాశంగా తీసుకొని మోసం చేస్తున్నారు కొందరు. అలాంటి సంఘటనే హైదరాబాద్ లోని హయత్ నగర్ లో చోటు చేసుకుంది. సప్పిడి పూలమ్మ అనే మహిళ గత కొంతకాలంగా చిట్టీలు నడిపిస్తూ నమ్మకంగా ఉండేది. సొంత ఇల్లు, పాల వ్యాపారం ఉన్న పూలమ్మ ను నమ్మి చాలామందే చిట్టీలు వేశారు. కొన్ని రోజుల నుండి చిట్టీలు ఎత్తినవారికి డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటూ, రెండు రోజుల క్రితం కరోనా వచ్చిందని కనిపించకుండా పోయింది.
తన ఇంట్లో ఉండే గేదెలను శనివారం సాయంత్రం మరో చోటికి తరలించింది. అది గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం ఆమె ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పూలమ్మ ఇంట్లో లేకపోవడంతో.. ఆమె కుమారుడు నరేశ్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా బాధితులు డిమాండ్ చేయడంతో, నరేశ్ ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని తెలిపాడు. దీంతో దాదాపు 70 మంది బాధితులు ఆదివారం హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.