నాకేం తెలియదు.. కొరియోగ్రాఫర్ చెప్పిందే చేశా :ప్రీతి

by Shyam |
నాకేం తెలియదు.. కొరియోగ్రాఫర్ చెప్పిందే చేశా :ప్రీతి
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా సినిమాల్లోకి వచ్చిన ఫస్ట్ డేస్ గుర్తు చేసుకుంది. 1998లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన “దిల్ సే” మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతి.. తొలి సినిమాలోనే షారుఖ్ ఖాన్ తో జతకట్టి శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత స్టార్ రేంజ్ కు దూసుకుపోయిన భామ.. “జియా జలే” సాంగ్ షూటింగ్ టైమ్ లో జరిగిన ఫన్నీ మూమెంట్ అభిమానులతో షేర్ చేసుకుంది. ఏనుగుల గుంపు ముందు డాన్స్ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సొట్ట బుగ్గల సుందరి.. ఫన్నీ కాప్షన్ జత చేసింది. ” నేనేం చేస్తున్నానని ఏనుగులు ఆశ్చర్యపోతున్నాయని అనుకుంటున్నారు కదా? కొరియోగ్రఫర్ ఫరా ఖాన్ నన్ను గుడ్ గర్ల్ లా ఉండమని చెప్పింది. కేవలం తను చెప్పింది చేస్తూ పోయా. అందుకే ఇలా పోజ్ ఇచ్చా” అంటూ తనకేమీ సంబంధం లేదని ఫొటో షేర్ చేసింది. ఈ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ కాగా ఫన్నీ క్యాప్షన్ కు అభిమానులు లైక్ లు కొడుతున్నారు.

ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ప్రీతి.. ఈ మధ్య తన కుటుంబం కరోనా బారినపడి కోలుకుందని పోస్ట్ పెట్టింది. ఇదంతా నెల క్రితం జరిగిందని.. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, తనకు ఆనందంగా ఉందని తెలుపుతూ.. ఆ సమయంలో జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ షేర్ చేసుకుంది. అభిమానులు అందరూ కూడా మాస్క్ ధరించాలని, కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Advertisement

Next Story