‘జర్నలిస్టులకు మెడికల్ కిట్లు అందించాలి’

by Shyam |
‘జర్నలిస్టులకు మెడికల్ కిట్లు అందించాలి’
X

దిశ, హైదరాబాద్: సమాజానికి వార్తలు చేరవేసేందుకు అనుక్షణం ప్రమాదంలో ఉండి పనిచేస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేయాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళి చారిలు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు సీఎంకు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రక్రియలో వైద్యారోగ్య, పోలీస్, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా భాగస్వాములై ఉన్నారన్నారు. కొవిడ్ -19 పట్ల ప్రభుత్వం అందించే ఆదేశాలు, సూచనలను కింది స్థాయి ప్రజలకు చేర్చేందుకు జర్నలిస్టులు సాహసోపేతంగా పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా హెల్త్, పొలిటికల్, క్రైం బీట్లు చూస్తున్న సీనియర్ రిపోర్టర్లకు కొవిడ్ 19 సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని, వీరి ద్వారా కార్యాలయాల్లో, వారి కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్నారు. ముంబయి, చైన్నై ఘటనల తరహాలో మరిన్ని ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ముఖ్యమైన బీట్లు చూస్తున్న రిపోర్టర్లందరికీ అవసరమైన మెడికల్ కిట్లను అందజేయాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాగానికి తగు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు.

Tags : Covid 19 effect, Journalists reporting, Press club, Vijay kumar Reddy

Advertisement

Next Story

Most Viewed