దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

by Shamantha N |
దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పరేడ్‌లో బంగ్లాదేశ్ సాయుధ దళాలు, బ్యాండ్ బృందాలు పాల్గొన్నాయి. ఇరుదేశాల దృఢమైన బంధానికి ప్రతీకగా బంగ్లాదేశ్ బలగాలు ప్రదర్శన నిర్వహించాయి. కొవిడ్ నిబంధల దృష్ట్యా మోటార్ సైకిల్ ప్రదర్శనను రద్దు చేశారు.

అత్యాధునిక టీ 90 యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన, బీఎంపీ- 2, పినాక బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థ, డీఆర్‌డీవో రక్షణ సాంకేతిక ఉత్పత్తులు, ఏడాదిలో డీఆర్‌డీవో సాధించిన విజయాలను ప్రదర్శించారు. ట్యాంకు విధ్వంసక క్షిపణులు సాధించిన ప్రగతి, నాగ్, హెలినా, ఎంపీఏటీజీఎం, సంత్, లేజర్, ఏటీజీఎం క్షిపణులు, తొలిసారిగా రఫేల్ యుద్ధ విమానాలను పరేడ్‌లో ప్రదర్శించారు.

slug:

Advertisement

Next Story

Most Viewed