రాష్ట్రాలు కోరితే ఆక్సిజన్ రైళ్లు నడుపుతాం 

by Shamantha N |
Oxygen supply under Indian Railways
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వాల కోరితే మరిన్ని ఆక్సిజన్‌ రైళ్లను నడపడానికి సన్నద్ధంగా ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే శాఖ ఇప్పటి వరకు 664 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ)ను చేరవేసిందన్నారు. మార్గమధ్యలో మరో 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉందని వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లోని సాగర్, జబల్‌పూర్‌కు బొకారో నుంచి 4 ట్యాంకర్లలో 47.37 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓతో కూడిన 2 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు, హర్యానకు 2ఎక్స్‌ప్రెస్‌లు చేరుకోబోతున్నాయని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు నిరంతరం ఆక్సిజన్ సరఫరా జరుగుతోందన్నారు. భారతీయ రైల్వే సరఫరా చేసిన 664 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌‌లో మహారాష్ట్రకు 174 మెట్రిక్‌ టన్నులు, ఉత్తర ప్రదేశ్‌కు 356.47 మెట్రిక్‌ టున్నులు, మధ్య ప్రదేశ్‌కు 64 మెట్రిక్‌ టన్నులు,ఢిల్లీకి 70 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసిందని, హర్యానా, తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు చేరుకోనున్నాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed