- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాయి ధరమ్ తేజ్ కోసం ప్రార్థనలు చేయండి : అపోలో వైద్యులు

దిశ, వెబ్‌డెస్క్ : సాయి ధరమ్ తేజ్ ప్రాణానికి ప్రమాదం లేదని అపోలో వైద్యులు ప్రకటించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కానీ 48 గంటల గడిచిన తర్వాతనే పూర్తి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడని, ఉదయం వరకు మాట్లాడుతాడని తెలిపారు. ఆయన కోసం ప్రార్థన చేయాలని వైద్యులు సూచించారు. శ్వాస సంబంధ సమస్యతోనే మెడికవర్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారని వివరించారు. దాని వల్ల ప్రమాదం ఏంలేదని కానీ, యాక్సిడెంట్ జరిగిన సమయంలో గాయాలు ఎక్కువగా అవుతాయని, 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చని స్పష్టం చేశారు. తేజ్ కాలర్ బోన్ విరిగిందని మరో వైద్యుడు వెల్లడించారు. అయితే ప్రాణానికి ప్రమాదం లేదంటూనే వెంటిలేటర్ పై ఉన్నాడని, 48 గంటల తర్వాతనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అంచనాకు వస్తామని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది.