అడవి జంతువుల లెక్కింపుపై సాధన..

by Aamani |
అడవి జంతువుల లెక్కింపుపై సాధన..
X

దిశ, అచ్చంపేట : జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ అటవీ ప్రాంతంలో జాతీయ జంతువు గా పిలువబడుతున్న పెద్దపులి తోపాటు ఇతర జంతువుల గణన ఏ విధంగా లెక్కించాలి అనే దానిపై అటవీశాఖ సిబ్బందితో రెండు రోజులపాటు జంతు గణన రిహార్సల్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో అచంపేట డివిజన్ ,అమ్రాబాద్ డివిజన్ స్థాయిలోను, రేంజ్ పరిధి అటవీ ప్రాంతంలో పులుల, జంతువుల గణన చేయడం జరిగింది.

ఈ నెల 16న అటవీప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్, నాలాలూ, కుంటలు, రివర్ ఏరియా లలో జంతువుల నమోదు ప్రక్రియ చేయడం జరిగింది. 17,18 తేదీల్లో ట్రాన్స్సెక్ట్ లైన్ వెంబడి పెద్దపులుల, చిరుత పులులు, ఎలుగు బంట్లు, మనబోతు అన్ని రకాల జంతులు తిరిగిన ప్రదేశాల్లో దాని అడుగు జాడలు, పెంటికలు నమోదు ప్రక్రియ ను విజయవంతం గా నమోదు చేశారు.

ఫిబ్రవరి నెలలో పూర్తిస్థాయి గణన జరుగుతుంది
అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అడవి ప్రాంతంలో అడవి జంతువులతో పాటు పెద్దపులి లెక్కింపు చేపట్టారా అని “దిశ” ఆదివారం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ ను చరవాణి ద్వారా సంప్రదించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన మూడు రోజుల నుండి అమ్రాబాద్, అచ్చంపేట అటవీశాఖ డివిజన్ పరిధిలోని 240 బీట్ ల లో జంతు గణన అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన వాటర్ బాడీస్, సహజసిద్ధ నీటివనరుల ప్రదేశాలలో లెక్కింపు రిహార్సల్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పూర్తిస్థాయిలో వచ్చే ఫిబ్రవరి నెలలో జాతీయ పెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఎన్ టిసిఎ న్యూ ఢిల్లీ వారి ఆదేశాల ప్రకారం పెద్దపులిఇతర జంతువుల లెక్కింపు చేపడతామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed