Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్, ముగ్గురి పరిస్థితి విషమం

by Shiva |
Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్, ముగ్గురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కాకినాడ (Kakinada) జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీమవరం (Bheemavaram) ప్రాంతానికి చెందిన ఏడుగురు కలిసి కారులో అన్నవరం (Annavaram) సత్యనారాయణ స్వామి దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు శంఖవరం (Shankaravam) మండల పరిధిలోని కత్తిపూడి (Katthipudi) వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed