- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభాస్ ‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్

బాహుబలి హీరో ప్రభాస్ వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు మరో బిగ్గెస్ట్ మూవీ గురించి రివీల్ చేశాడు.
‘చెడుపై మంచి విజయాన్ని సాధించిన వేడుక జరుపుకుంటున్నాం’ అంటూ తన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘ఆదిపురుష్’ టైటిల్‌తో వస్తున్న సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. 3డీ యాక్షన్ డ్రామాగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సాహో, రాధే శ్యామ్ తర్వాత భూషణ్ కుమార్, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నట్టు సమాచారం. 2021 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో బాహుబలికి విలన్‌గా ఓ బాలీవుడ్ హీరో పేరు పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది.