- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ వ్యాప్తంగా పెళ్లీలన్నీ పెటాకులు !
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్‌తో పెళ్లీలన్నీ పెటాకులయ్యాయి. రోజురోజుకూ చాపకింద నీరులా మాయదారి వైరస్ విజృంభణతో కొన్ని పెళ్లిళ్లు పెటాకులు కాగా, మరికొన్ని పోస్ట్‌పోన్ అయ్యాయి. దీంతో కోటి ఆశలతో కొత్త లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న యువతి, యువకుల ఆశలు అడియాశలై పోయాయి. అయితే గత ఫిబ్రవరి నెలలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నవారు ఈనెల 10 వరకు అంతో ఇంత భయంతో కార్యక్రమాలను వెళ్లదీసినా, తర్వాత జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో పెళ్లీలన్నీ వాయిదా వేసుకున్నారు.
ఫంక్షన్ హాళ్లను కిరాయికి ఇస్తే యజమానులపై కేసు నమోదు చేసి జైల్లో వేస్తామని సాక్షాత్తు రాష్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో వార్నింగ్ ఇవ్వడంతో అంతా భయపడిపోయారు. తర్వాత వైరస్ అరాచకం మరింత శృతిమించడంతో రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, మరోవైపు ప్రధాని మోడీ సైతం నాల్గురోజుల క్రితం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో, ఏప్రిల్ నెలలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకున్న ఫ్యామిలీలు మొత్తం ఆలోచనను మార్చుకున్నాయి. ఓ వైపు చైనా, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్‌లో వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తుండడమే గాక, ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి నిర్వహించినా కరోనా భయానికి ఎవరూ రాలేరన్న ఉద్దేశంతో మనసు మార్చుకున్నారు. వీలైతే దీపావళి సమయంలో ముహూర్తాలకు లేకుంటే మళ్లీ వచ్చే ఏడాదే తమ ఇళ్లలో పెళ్లి బాజాలు మోగించాలని ఫిక్సై పోయారు.
హైదరాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి నెలలో ఎంగేజ్‌మెంట్ జరిపి ఏప్రిల్, మే నెలలో పెళ్లిళ్లు చేయాలనుకున్నవారు ఏకంగా పెళ్లిళ్లనే మొత్తం రద్దు చేసుకున్నారు. వచ్చే ఏడాదికి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న దృష్ట్యా ఎంగైజ్‌మెంట్ అయినా కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మొత్తం సంబంధాలనే క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పెళ్లి సెటిల్ అయినప్పటి నుంచి ఎంగేజ్‌మెంట్ వరకు ఖర్చులు కుటుంబాలకు తీవ్రంగా ఆర్థికంగా నష్టాన్ని మిగల్చడమే కాకుండా మానసికంగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి ఘటనలు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో దాదాపు వాయిదా పడగా.. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీడియో కాలింగ్ ద్వారా ఎంగేజ్‌మెంట్ జరగడం గమనార్హం.
Tags: coronavirus, marriage, post pone, world, china, america, France, Italy, Diwali, Telugu states