ఇల్లు కొనేసిన పూజ.. ఒంటరిగా ఉంటుందేమో?

by Jakkula Samataha |
ఇల్లు కొనేసిన పూజ.. ఒంటరిగా ఉంటుందేమో?
X

దిశ, సినిమా : బుట్టబొమ్మగా సౌత్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న పూజా హెగ్డే.. తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లోని స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. వీటిలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’, రణ్‌వీర్ సింగ్ ‘సర్కస్’, సల్మాన్‌ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాళి’, అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉండటం విశేషం. ఇక తాజాగా ముంబైలోని బాంద్రాలో 3 BHK అపార్ట్‌మెంట్ కొనేసిన పూజా హెగ్డే.. ఇందులోని ఇంటీరియన్‌ను స్పెషల్‌గా డిజైన్ చేయించుకుందట. ఇప్పటివరకు ముంబైలో తల్లిదండ్రులతోనే ఉన్న పూజ.. ఆ ఇంటికి దగ్గర్లో ఉండే అపార్ట్‌మెంట్‌ను సెలెక్ట్ చేసుకుందట. ఏదేమైనా తన సంపాదనతో ఇల్లు కొనడం ఆనందంగా ఉందని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కస్’ షూటింగ్‌లో పాల్గొంటున్న భామ.. ఈ మూవీ తర్వాత ఫర్హాద్ శాంజీ దర్శకత్వంలో వస్తున్న సల్మాన్‌ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్‌లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసినట్లు ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story