- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు ఒకేసారి 7 వేలు పెన్షన్.. ఒకటో తేదీన కచ్చితంగా తీసుకోవాలి.. లేకపోతే..?
దిశ వెబ్ డెస్క్: కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావు అంటే సక్కాటోళ్లను వెక్కిరించడానికే పుట్టాను అన్నట్టుంది వైసీపీ తీరు అని పలువురు మండిపడుతున్నారు. అధికారంలో ఉండగా అబద్ధాలతో కాలం గడిపిన వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత సైతం అవే అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడవక ముందే అధి చేయలేదు, ఇది చేయలేదంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సైతం నెటిజన్స్ ఘాటుగా స్పంధిస్తున్నారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు ఏం చేశారు..? అప్పుడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చని మీకు ఇప్పుడు కూటమిని ప్రశ్నించే హక్కు లేదని ప్రజలు తేల్చి పెప్తున్నారు. ఎవరు ఎన్ని అన్నా వైసీపీ మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. తాజాగా రేపు పంపిణీ చేయనున్న పెంన్షన్‌లపై ట్విట్టర్ వేదికగా అసత్య ప్రచారాలను చేస్తూ ఓ వీడియోని అప్లోడ్ చేసింది. పెన్షన్‌ను తీసుకునే వాళ్లు కచ్చితంగా 1,2 తేదీల్లో తీసుకోవాలని లేకపోతే రద్దు చేస్తాం అని దండోరా వేస్తున్న వీడియోని వైసీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కాగా వైసీపీ ట్వీట్‌పై టీడీపీ స్పంధించింది. ‘పేదలకు ఒకేసారి రూ.7 వేలు పెన్షన్ ఇస్తుంటే, జగన్ రెడ్డి ఓర్వలేక, తన ప్యాలెస్ బుద్ధి బయట పెట్టుకున్నాడు. చంద్రబాబు గారు స్పష్టంగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని చెప్తున్నా ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. తన హయాంలో (2024 ఏప్రిల్ ముందు) పేదలను పీక్కుతింటూ, ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తాం అంటూ వేసిన డప్పుని, నేడు మళ్ళీ చూపిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు.’ అని వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మూడు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోరని వైసీపీ ట్వీట్‌కి టీడీపీ రీట్వీట్ చేసింది.