AP Politics: నామినేషన్ వేసిన వైఎస్ షర్మిలా.. వెంట ఎవరున్నారంటే..?

by Indraja |
AP Politics: నామినేషన్ వేసిన వైఎస్ షర్మిలా.. వెంట ఎవరున్నారంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు కడప అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ముందుగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేర్‌రెడ్డికి షర్మిల నివాళులు అర్పించారు.

అనంతరం తన సోదరి సునీతతో కలిసి కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

తాను ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్నానని.. ఈ నేపథ్యంలో తాను దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని.. న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను అని పేర్కొన్నారు. అలానే వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, వైఎస్ వివేకానంద‌రెడ్డిని మరిచిపోలేని ప్రజలందరూ తనని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాని.. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed