ప్రమాదంలో సీఎం జగన్‌.. కీలక నేత కన్నీటిపర్యంతం.. లండన్‌కు వైసీపీ నేతల పరుగులు..

by Indraja |
ప్రమాదంలో సీఎం జగన్‌.. కీలక నేత కన్నీటిపర్యంతం.. లండన్‌కు వైసీపీ నేతల పరుగులు..
X

దిశ వెబ్ డెస్క్: చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి.. అవకాశం ఉన్నప్పుడే ఊరు దాటాలి. అని వైసీపీ నేతలు చెప్పకనే చెబుతున్నారు. 2024లో వైసీపీ ఓటమి ఖాయమని పార్టీ అదినేతతోపాటు నేతలకు సైతం అర్ధమైపోయింది. అదే జరిగితే ముఖ్యమంత్రి జగన్‌తోపాటు అతని బాటలో నడిచిన తమకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనే విషయం బోధపడినట్టు ఉంది.. అందుకే ఒక్కొక్కరుగా లండన్‌‌కు జారుకుంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

లండన్ వీదుల్లో వైసీపీ నేతలు..

ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మహన్ రెడ్డి లండన్‌లో కుటుంబ సమేతంగా విహరిస్తున్నారు. రాజు వెంటే మంత్రి అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం లండన్‌కి చేరినట్టు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతైనా సలహాదారులు కదా.. చప్పుడు కాకుండా లండన్ చెక్కేసినట్టు తెలుస్తోంది. అలానే పలువురు వైసీపీ నేతలు సైతం మెల్లగా లండన్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారని సమాచారం. కాగా సీఎం వైఎస్ జగన్మహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం లండన్‌కు చేరుకున్నారు. అయితే లండన్ గూటికి చేరుతున్న వైసీపీ నేతలందరికీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. కాగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అందరికంటే ముందుగానే లండన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.

సీఎం జగన్‌ ప్రమాదంలో ఉన్నారు.. ఎలాగైన కాపాడుకోవాలి..

లండన్‌కు చేరుకున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి అక్కడ ఉన్న వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులతో సమవేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైయ్యారు. ‘‘ప్రజల కోసం పని చేసే ఒకేఒక వ్యక్తి జగన్ అన్న, ఆయన కష్టం నాకు తెలుసు, ఎంత ప్రమాధంలో ఉన్నాడో కూడా నాకు తెలుసు.. అది ఒక్కటి గర్తుపెట్టుకోండి.. ఎవరు మనవాడో, ఎవరు పరాయివాడో తెలీదు, చెప్పినా ఆయన వినట్లేదు, ఏదైతే అది అయిందనే ధోరణితో ఉన్నారు.

కాని మనం అందరం కలిసి జగన్ అన్నను కాపాడుకుందాం అది ఒక్కటే మనకి ముఖ్యం.’’ అంటూ ఏడ్చేశారు. అయితే ప్రస్తుతం పొన్నవోలు లండన్ ఎందుకు వెళ్లారు..? జగన్‌ను కాపాడుకోవాలని ఎందుకు ఏడ్చారు..? జగన్‌కు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి..? అని రెకెత్తుతున్న ప్రశ్నలపై సస్పెన్స్ నెలకొంది.

Advertisement

Next Story