AP Politics: భర్త అశోక్ కోసం భార్య నీలోత్పల..

by Indraja |
AP Politics: భర్త అశోక్ కోసం భార్య నీలోత్పల..
X

దిశ ప్రతినిధి, శ్రీకాకుళం: ఇఛ్చాపురం నుంచి టీడీపీ అభ్యర్దిగా బెందాళం అశోక్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నీలోత్పల ప్రచారంలోకి దిగారు. పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ రానున్న ఎన్నికల్లో తన భర్తను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్దిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నేడు లొద్దపుట్టిలో ప్రచారం నిర్వహించారు.

కాగా ఆమె నిర్వహించిన ఈ ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఇక ఈ ప్రచారంలో ఆమెతో పాటు జనసైనికుల పాల్గొన్నారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు నెలకు 4000 రూపాయల చొప్పున అందుతాయని, మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. అలానే చదువుకొనే విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం ఆపేసిన పథకాలను తెలుగుదేశం తిరిగి తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు.


Advertisement

Next Story